తెలంగాణ వీణ , సినిమా : ఫైనల్-6లో ఒకడైన యావర్.. తన బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫొటలన్నీ చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూంలో స్క్రీన్‌పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్‌బాస్.. కేజీఎఫ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాడేశాడు. వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. ‘నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించే అంతా దమ్ముంది’ అని యావర్.. తన ఫీలింగ్ బయటపెట్టాడు.