ఏజెన్సీ చట్టాలు రాకముందు ఇక్కడ ఉన్న వారిని గుర్తించడానికి ప్రభుత్వం సర్వే చేయాలి
నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని.
తెలంగాణ వీణ, ములుగు : ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ లో 1/70 యాక్ట్ చట్టాలు ఈ ప్రాంతానికి గిరిజన చట్టాలు రాకముందు నుండి ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ గిరిజన చట్టాలు అమలు చేయాలని నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ లో వలసవాదులను గుర్తించడానికి 1970 కంటే ముందు ఉన్న ఓటర్ లిస్ట్ ఆధారంగా మరియు ఎవరికైనా అప్పటి వారి భూమి శిస్తులు, పట్టాలు, సెటిల్మెంట్ పట్టాల ఆధారంగా కులాల వారీగా , వారి వారసత్వాల వారీగా గుర్తించి కమిటీ వేసి , ప్రభుత్వాలు సర్వే చేపట్టాలని, అందరికీ గిరిజన చట్టాలు అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇప్పుడున్న ఏజెన్సీ లో కొంతమంది గిరిజనేతరులు ఎలా వలస వచ్చారో, ఏజెన్సీ చట్టాలు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోకి పక్క రాష్ట్రాల నుండి కొంతమంది గిరిజనులు కూడా వలస వచ్చిన వారు కూడా ఉన్నారని ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వాలు సర్వే చేయాలి, 1/70 యాక్ట్ రాక ముందు ఉన్న వారికి గిరిజన చట్టాలు పూర్తిగా పుట్టిన ప్రాంతంలో భూమిపై భుక్తిపై హక్కులు కల్పిస్తూ ప్రకటన చేయాలి. చట్టాలు వచ్చిన తర్వాత వచ్చిన గిరిజనులకు, గిరిజనేతరులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే జరిగి ఎవరి హక్కులు వారికి కల్పించే వరకు భారతదేశం లో ఎక్కడ అయిన నివసించే హక్కు , బ్రతికే హక్కు ఉందని అంటున్న ఈ ప్రభుత్వాలు, ఇప్పుడున్న రేషన్ వార్డ్, ఆధార్ కార్డ్ ఆధారంగా అందరికీ సమాన హక్కులు, అన్నింటి పై కల్పించాల్సిందేనని , లేకుంటే ప్రజా ఉద్యమాలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని గద్దె దించుతామని అన్నారు.