తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఈసారి ఎంత మందికి టికెట్ వస్తుందో? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే పలువురిని పక్క నియోజకవర్గాలకు మారుస్తూ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ… తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. వారి ఆశలు ఫలించవని అన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.