చేర్యాల అఖిలపక్షం పక్షం భారీ రాస్తారోకో
తెలంగాణ వీణ , సిద్దిపేట : సిద్దిపేట జిల్లా చేర్యాల చేర్యాల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను సక్రమంగా ఇరువైపులా సమానంగా తీయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేర్యాల పాత బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, బీజేపీ జిల్లా కార్యదర్శి బూరు సురేష్ గౌడ్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరన్న, ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మల్లిగారి యాదగిరి, బీఎస్పీ మండల అధ్యక్షులు బుట్టి బిక్షపతి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణలు మాట్లాడుతూ.. చేర్యాల పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని, చేర్యాల పట్టణ పరిస్థితులను బిల్లింగ్ యజమాను అభ్యర్థను పరిగణలోకి తీసుకొని నోటీసులు జారీ చేసిన తర్వాతనే రోడ్డు విస్తరణ పనులు జరిపాలని నిబంధన ఉన్నప్పటికీ, ఇలాంటి నోటీసులు జారీ చేయకుండా ఒకపక్క 38 ఒకపక్క 46 ఫీట్లు మార్కింగ్ చేస్తూ రోడ్డు విస్తరణ అధికారులు, మున్సిపల్ కమిషనర్, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా మార్కింగ్ చేస్తూ రోడ్డు తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. వివిధ ప్రాంతాలను నుంచి పట్టణంలో కాయకష్టం చేసి ఇండ్లు నిర్మించుకుని దుకాణ సముదాయాలు వ్యాపారాలు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రోడ్డు వెడల్పులో నిబంధనలు పాటించి ఇరువైపులా సమానంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పోతుగంటి రాందాస్, ఈరి భూమయ్య, ముస్త్యాల రాజేష్, రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, జంగిలి యాదగిరి వైశ్య సంఘం అధ్యక్షులు నీల శివకుమార్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు శేరి బాలనారాయణ, వైశ్య యువజన సంఘం అధ్యక్షులు అయిత సంపత్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ మంచాల కొండయ్య, పట్టణ వ్యాపారస్తులు తదితరులు.