తెలంగాణ వీణ , జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం అర్ధరాత్రి జమ్మూలోని అక్నూర్ సెక్టార్ వద్ద సరిహద్దు దాటడానికి ప్రయత్నించారు. వీరిని గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారు వెనక్కి వెళ్లిపోయారు. అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన ముగ్గురు తమ వెంటే వెనక్కి లాక్కెళ్లిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ‘ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. నలుగురిలో ఒకరిని కాల్చి చంపాం. మిగిలిన ముగ్గురు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించాం’ అని ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ ఎక్స్(ట్విటర్)లో తెలిపింది.