Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అందుకే టీవీల్లో కనిపించడం లేదు

Must read

తెలంగాణ వీణ , సినిమా : బిగ్ బాస్’ సీజన్ 6లో లుక్ పరంగా యాక్టివ్ గా ఉండటం పరంగా శ్రీ సత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో చికెన్ కావాలంటూ ఆమె చేసిన అల్లరిని ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. ఆ తరువాత శ్రీసత్య కొన్ని టీవీ షోస్ లో సందడి చేసింది. ఈ మధ్య కాలంలో మాత్రం, ఆమె టీవీల్లో కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో శ్రీ సత్య మాట్లాడుతూ గతంలో నేను సీరియల్స్ లో చేశాను .. అలాగే టీవీ షోస్ లో కనిపించాను. కానీ ఆ తరువాత ఇక సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాను. అందువలన కొంతకాలం పాటు బుల్లితెరకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని, సినిమా అవకాశాలపైనే దృష్టి పెట్టాను అని అంది. ఈ మధ్య కాలంలో నేను సినిమాలతో కాస్త బిజీగా ఉన్నాను. ‘డీజే టిల్లు 2’లో ఉన్నాను. రీసెంటుగా ఆ షూటింగు పూర్తయింది. త్వరలో ఒక సినిమా షూటింగు కారణంగా అమెరికా వెళ్లబోతున్నాను. వేరే ప్రాజెక్టులపై సైన్ చేసి ఉన్నాను.
నేను పెద్ద స్క్రీన్ పై చూసుకోవాలని అనుకుంటున్నాను .. అందుకే పూర్తి ఫోకస్ అటు వైపే పెట్టాను అని చెప్పింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you