తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. రేపటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తన కల అన్నారు. తాను చెప్పినట్లుగా జరుగుతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ఏడో తేదీన అని చెప్పడంతో తాను సంతోషించానన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్నారు.