తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశం ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో జరుగనున్నది. సోమవారం సాయంత్రానికి తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.