తెలంగాణ వీణ,మంచిర్యాల : సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలలో భాగంగా మంగళవారం మందమర్రి ఏరియా శాంతి కని గనిమీద నిర్వహించిన గేట్ మీటింగ్లో హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నికల నిర్వహణ కార్మికుల పాలిట శాపంగా మారిందని స్వేచ్ఛగా జీవించిన కార్మికులకు ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని కనీస హక్కుల కోసం అడిగే స్వేచ్ఛను కార్మికులు కోల్పోయారని లక్ష 16 వేల మంది ఉన్న కార్మికుల సంఖ్య 39 వేల ఎనిమిది వందలకు కుదిరించబడ్డారని ప్రస్తుతం సంస్థలో పనిచేసిన కార్మికుల మీద తీవ్రమైన పని భారం పడుతుందని దీనికంతటికి కారణం కార్మికులు గుర్తింపు సంఘాలుగా ఎన్నుకోబడిన సంఘాల వైఫల్యం అని పోరాట సంఘం అని చెప్పుకునే ఏఐటియుసి తప్పుడు విధానాల వల్లనే సింగరేణిలో కార్మికులకు ఈ కష్టాలని ఆయన ధ్వజమెత్తారు గెలిచిన సంఘాలు కార్మిక హక్కుల కోసం మాట్లాడడం మానేశాయని పైరవీలకు ఎగబడి దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని కార్మికులను పీల్చి పిప్పి చేశాయని కార్మికులు ఐ ఎన్ టి యు సి సంఘాన్ని పాతరేశారని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చిందని అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కానీ రాష్ట్రం సాధించిన పార్టీగా టిఆర్ఎస్ మాత్రమే చెప్పుకొని అధికారాన్ని చేపట్టి దానికి అనుగుణంగా టీబీజీకేఎస్ అనే సంఘాన్ని ఏర్పాటు చేస్తే అది దళారుల కూటమిగా మారి కార్మికుల పాలిట శాపంగా మారిందని విపరీతమైన లంచాలకు ఆ నాయకులు ఎగబడ్డారని అందువల్లనే సింగరేణిలో కార్మికులకు నిత్యనిబంధం వచ్చిందని వే అధికారుల వేధింపులు అక్రమ బదిలీలు డిప్యూటేషన్ల పేరా లక్షల రూపాయలు దండుకోవడం సింగరేణి క్వార్టర్లను దళారులకు కట్టబెట్టడం కార్మికులకు కూలిపోయిన కోటర్లను కట్టబెట్టి హెచ్ఆర్ఏ కొట్టడం లాంటి అనేక కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యాన్ని పెంచి కార్మికోద్యమాలను నీరుగాతున్నారని అన్ని రకాల ప్రమోషన్లను అమ్ముకుంటున్నారని న్యాయంగా కార్మికులకు చెందవలసిన అనేక హక్కులను కాలరాస్తున్నారని కార్మికులు గతంలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ కూడా హరించబడ్డాయని కనీస వసతులకు కార్మికులను దూరం చేశారని భూగర్భ గనుల్లో ఖాళీ గాలి నీరు లాంటి సదుపాయాలను కూడా పొందలేని దౌర్భాగ్యానికి కార్మికులను గురి చేస్తున్నారని మొన్న నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు గతంలో టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ గా పేరు మార్చుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని అదే చైతన్యాన్ని సింగరేణి ఎన్నికలలో కూడా ప్రదర్శించి పోరాటాలకు పుట్టినిల్లు అయిన సింగరేణిని రక్షించుకోవాలంటే కార్మిక హక్కుల కోసం ఓడిన గెలిచిన నిత్యం పోరాడుతున్న హెచ్ఎంఎస్ ను ఆదరించాలని ఈ నెల 27న జరగబోయే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలలో హెచ్ఎంఎస్ గుర్తు తరాజు గుర్తు పై ఓటు వేసి నిశ్శబ్ద విప్లవాన్ని కార్మికులు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు నీరటి రాజన్న హెచ్ఎంఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెల్ది సుదర్శన్ ఏరియా కార్యదర్శి నవీన్ శాంతి కనీ ఫిట్ కార్యదర్శి నీరటి కార్తీక్ అసిస్టెంట్ కార్యదర్శి సాదక్ అలీ ఎస్ చంద్రశేఖర్ జి రాజ్ కుమార్ ఎండి పాషా టి రమేష్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి తిరుపతి పి నాగేష్ ఎస్ మహేష్ జగదీష్ సుమన్ రవి బుంగ సురేందర్ దుర్గం లక్ష్మణ్ పైడయ్య సదానంద గౌడ్ గోమాస ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు