తెలంగాణ వీణ , సినిమా : అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 30 రోజుల నుంచి చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని జాతర నేపథ్యంలో సాగే పాటను దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్లతో తెరకెక్కించినట్లు సమాచారం. ఆ సాంగ్‌తో పాటు అక్కడ భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించినట్లు వర్గాలు తెలిపాయి. అయితే షూటింగ్‌లో భాగంగా అల్లు అర్జున్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చిందని సమాచారం. దీంతో చిత్ర షూటింగ్‌ను డిసెంబర్ రెండవ వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
భారీ కాస్ట్యూమ్స్‌తో ఫైటింగ్ సీన్స్‌లో రిస్క్ చేయడం వల్ల ఆయనకు ఈ ఇబ్బంది ఎదురైందట. సినిమా చిత్రీకరణ విషయంలో ఇప్పటికే ఆలష్యం కావడంతో వెన్నునొప్పి ఉన్నా కూడా షూటింగ్ కొనసాగించమని సుకుమార్‌ను బన్నీ కోరాడట. అయితే సుకుమార్ మాత్రం అందుకు అంగీకరించలేదని వినికిడి. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశాడట.