Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఒక్క లీక్డ్ పిక్ తో సోషల్ మీడియా షేక్

Must read

తెలంగాణ వీణ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్దిన కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాని కొరటాల శివ హ్యూజ్ కాన్వాస్ తో షూట్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఎన్టీఆర్-కొరటాల ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ తోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలని మరింత పెంచడానికి త్వరలో టీజర్ బయటకి రానుంది. అయితే అది టీజర్ కాదు జస్ట్ దేవర వరల్డ్ ని పరిచయం చేయబోయే గ్లిమ్ప్స్ మాత్రమే అనే టాక్ కూడా వినిపిస్తోంది. న్యూ ఇయర్ లేదా సంక్రాంతి రోజున దేవర నుంచి అప్డేట్ బయటకి వస్తుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసారు.గత కొన్ని రోజులుగా వీ వాంట్ దేవర అప్డేట్ అని ట్వీట్స్ చేస్తున్న ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ దేవర ఆన్ సెట్స్ లీక్డ్ పిక్ బయటకి వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ లో ఉన్న దేవర గెటప్ లో బ్లాక్ అండ్ బ్లాక్ వేసి కనిపించడంతో ఫ్యాన్స్ మరింత జోష్ లో ఉన్నారు. అభిమానులు ఇదే జోష్ దేవర టీజర్ రిలీజ్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తారు. అయితే ఈ లీక్డ్ పిక్ ని షేర్ చేసిన వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రం రిస్క్ లో పడ్డాయి. ఆ అకౌంట్స్ పై దేవర మేకర్స్ యాక్షన్ తీసుకోని క్లోజ్ చేయడం గ్యారెంటీ.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you