తెలంగాణ వీణ , రాష్ట్రీయం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద శాపాలుగా మారాయా? ఆయన దూకు డుకు కళ్లెం వేస్తున్నాయా? ఆయన ఆలోచనలకు ఇబ్బందిగా మారాయా? ఆయన వ్యూహాలను ప్రజల్లోకి వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా టీడీపీ-జనసేన ఎన్నికల పొత్తుల విషయంపై తన వ్యూహాన్ని పార్టీ కార్యకర్తలకు వివరించి చెప్పడంలోనూ.. వారిని ఒప్పించడంలోనూ పవన్ సక్సెస్ కాలేక పోయారనే వాదన ఉంది. వైసీపీ కోవర్టులు అంటూ.. పవన్ చేసిన వ్యాఖ్య కూడా అంతర్గతంగా పార్టీలో ఇప్పటికీ దుమారం రేపుతోంది. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం వైసీపీ అంతర్గత కుమ్ములాటతో కునారిల్లు తోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన తరఫున జెండాలు పట్టుకుని.. జంపిం గులు చేసేవారి సంఖ్య పెరగాల్సి ఉంది. కానీ, ఆ ఊపు, నేర్పు ఎక్కడా కనిపించడం లేదు. ఇది కూడా పవన్ వ్యూహాత్మక తప్పిదంగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు.. యువగళంపాదయాత్ర ముగింపు సభకు వస్తానని.. ఆ వేదికగానే.. తన అభిప్రాయాలను మరింతగా వివరిస్తానని చెప్పిన పవన్.. అనూహ్యంగా ఈసభకు డుమ్మా కొడుతున్నట్టు ప్రకటించారు. అధికారికంగా ఆయన చెప్పిన మాట కూడా.. వినసొంపుగా లేకపోవడం గమనార్హం. ‘అని వార్య’ కారణాల నేపథ్యంలోనే యువగళం ముగింపు సభకు రాలేకపోతున్నానని పవన్ ప్రకటించారు. ఇది పాజిటివ్ సంకేతాలకన్నా కూడా.. నెగిటివ్ సంకేతాలనే ఇచ్చిందని అంటున్నారు పరిశీలకులు.