- కోట్ల రూపాయల స్థలాలు లూటీ
- చోద్యం చూస్తున్న అదికారులు
- బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ యెర్రా కామేష్
తెలంగాణ వీణ , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో కోట్ల రూపాయల సింగరేణి స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నా సింగరేణి అదికారులు చోద్యం చూస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ యెర్రా కామేష్ విమర్శించారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి మండల తహశీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో కబ్జాకు గురైన సింగరేణి స్థలాన్ని సందర్శించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి స్థలాలను కాపాడటంలో అదికారులు పూర్తిగా విఫలమవుతున్నారని గతంలో ఇక్కడ ఉన్న సింగరేణి క్వాటర్ కూలిపోవడంతో సదరు ఖాళీ స్థలం పై కన్నేసిన కబ్జా దారులు ఖాళీ స్థలాన్ని చదును చేసి స్థంబాలు పాతి ఆటలు ఆడటం కోసం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సదరు స్థలంపై కన్నేసిన పాఠశాల యజమాని స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి అదికారులు తక్షణమే స్పందంచి కోట్ల రూపాయల విలువైన స్థలాలను గుర్తించి కబ్జాలకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, మాలోత్ వీరు నాయక్, వంగా రవిశంకర్, పోలే కనకరాజు తదితరులు పాల్గొన్నారు