తెలంగాణ వీణ , హైదరాబాద్ : సింగరేణి సంస్థ ఆవిర్భవించి 134 సంవత్సరాలు గడించి లక్షలాది మందికి ఉపాధి కల్పించిందని, దాదాపు 30,40 సంవత్సరాలు కస్టపడి సంస్థ అభివృద్ధి కి పాటుపడి పదవి విరమణ పొందిన తరువాత విశ్రాంత ఉద్యోగుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్ష జరిపి సవరించాలని నిబంధన అమలు చేయడం లేదని కనీస పెన్షన్ 15,000 రూపాయలు ఇవ్వాలని,అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలని,సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, తదితర డిమాండ్స్ పరిష్కారం కొరకు డిసెంబర్ 23 న “అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం, సింగరేణి డే వేడుకలు, సీనియర్ సిటిజెన్లకు “భీష్మ” అవార్డుతో సత్కారం, నూతన కమిటీ ఎన్నిక, నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ,అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగు ఆందోళన కార్యక్రమాల తీర్మానాలు, భవిష్యత్ ప్రణాళిక రూపొందించే తదితర కార్యక్రమాలను లలితా నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్ నెం 4, లలితా నగర్, నాగోల్, హైదరాబాద్ లో జరుగును. రోజు అసోసియేషన్ కావున సింగరేణి విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్, సంయుక్త కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యవర్గ సభ్యులు గీస కనకయ్య, టి.నర్సింహ రావు పిలుపు నిచ్చారుఇట్లు
ఆళవందార్ వేణు మాధవ్
ఉపాధ్యక్షులు,సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్(రి.నెం 494/2022) హైదరాబాద్