తెలంగాణ వీణ , సినిమా : ముఖానికి మ్యాకప్ వేసుకోవడానికే ముందే ప్యాకప్ చెప్పడం ఎలాగో? తెలుసుకుంది షానాయా కపూర్. జాన్వీకపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా’కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇండస్ట్రీ వాతావరణం అలవాటు చేసుకుంటుంది. కెమెరా వెనుక పరిస్థితులు ఎలా ఉంటాయి? కెమెరా ముందు ఎలా ఉంటాయి? వంటి వివరాలు అస్టిస్టెంట్ గా పనిచేసి తెలుసుకుంది. కపూర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చే ముందు కొన్ని రకాల అనుభవాలు భవిష్యత్ కి మంచిదే కదా అని భావించి ఆ రకంగా పరిశ్రమలో లాంచ్ అయింది. సిసలైన ప్రయాణం 2024 లో మొదలు పెట్టబోతుంది. ఈ బ్యూటీనీ కూడా కరణ్ జోహార్ పరిచయం చేసే బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా కోసం సన్నధం అవుతుంది. ఇక అమ్మడి సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు.