తెలంగాణ వీణ , సినిమా : పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న ప్రభాస్ ఈసారి సలార్ తో ఎలాగైనా సాలీడ్ సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడని ప్రభాస్ వరుసగా సాహో రాదేశామ్ ఆదిపురుష్ సినిమాలతో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సలార్ మొదటి రోజే ఊహించని స్థాయిలో 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని అభిమానులు అయితే చాలా నమ్మకంతో ఉన్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెన్సార్ పనులను కూడా ఇటీవల ముగించుకుంది. ఇక ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సలార్ మొదటి రోజు మాత్రం తప్పకుండా ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసేలా కలెక్షన్స్ అయితే వస్తాయని అనిపిస్తుంది. ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ అంత దూకుడుగా కనిపించకపోయినప్పటికీ ప్రభాస్ ప్రశాంత్ కాంబినేషన్ ద్వారానే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.