తెలంగాణ వీణ, సినిమా : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ టేకింగ్ తో తనదైన శైలిలో సినిమాలు తీయడం ఈ దర్శకుడి ప్రత్యేకత. అయితే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు.సొసైటీ లో జరిగే సంఘటనలను తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు.అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ ఆర్జీవి తెగ షేర్ చేశాడు.ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కాస్త చెప్పండి అంటూ పోస్టులు చేశాడు. ఆ అమ్మాయి వీడియోస్ పోస్ట్ చేస్తూ తన పై చీర అనే సినిమా తీస్తానని ప్రకటించారు. ఆర్జీవి చేసిన పోస్టులు బాగా వైరలయ్యాయి. ఇంకేముంది నెటిజన్స్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు.ఎట్టకేలకు ఆ అమ్మాయి ఇన్ స్టా ఐడీ కనుక్కొని వర్మ కు రిప్లై కూడా ఇచ్చారు. అయితే ఆ చీరకట్టు భామ పేరు శ్రీలక్ష్మీ సతీష్.ఈ భామ మోడ్రన్ దుస్తుల్లో కాకుండా చీరకట్టు లో ఫోటోషూట్స్ చేస్తుంది. చీర కట్టులో ప్రకృతిని ఆస్వాదిస్తూ కొన్ని రీల్స్ కూడా చేసింది. అవి చూసిన వర్మ ఆ అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభించారు. తాజాగా ఆ అమ్మాయిని అంత అందం గా వీడియోస్ తీసిన కెమెరామెన్ ను పిలిపించి ఆర్జివి మాట్లాడాడు.ఇప్పుడు ఈ భామ తో ఆర్జీవి శారీ అనే సినిమా తీస్తున్నాడు.ఈ చిత్రానికి ఆ అమ్మాయిని అందం గా వీడియోస్ తీసిన కెమెరామెన్ అఘోష్ దర్శకుడి గా పరిచయం చేస్తూ శారీ సినిమా ను తెరకెక్కిస్తున్నారు వర్మ. తాజాగా ఈరోజు ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్జీవీ డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శారీ సినిమా ను నిర్మిస్తున్నందుకు సంతోషం గా ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు.
TweetRGV DEN is SUPER EXCITED to launch the 1st look poster of its new film SAAREE ,an intense psychological THRILLER today on the INTERNATIONAL SAAREE DAY #SaareeGirl #SaareeFilm #RgvsSaaree #InternationalSaareeDay pic.twitter.com/j9lbqwp8mV
— Ram Gopal Varma (@RGVzoomin) December 21, 2023