తెలంగాణ వీణ , హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన స్వంత వాహనంలో రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎలాంటి హైరానా లేకుండా, ట్రాఫిక్ నిబంధనలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు కేసీఆర్ రాజీనామా లేఖను సమర్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటింది. దాదాపు 60 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. రాజీనామా సమర్పించిన అనంతరం సీఎం ఎక్కడికి వెళ్లనున్నారో ఆసక్తి నెలకొంది. బహుషా రాజ్‌భవన్‌నుంచి నేరుగా ఫామ్ హౌస్‌కే వెళ్లే అవకాశాలున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేయక ముందే తన సెక్యూరిటీని, కాన్వాయ్‌ని పక్కన పెట్టి స్వంత వాహనంలో రాజ్‌భవన్‌కు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరించింది.