తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తుపానుపై ప్రభుత్వం ముందస్తు చర్యలతో తీవ్ర నష్టం తప్పిందని, ప్రాణనష్టం లేకుండా ఆస్తినష్టంతో బయటపడ్డామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని దుయ్యబట్టారు.
‘‘నీచమైన ఆలోచనలతో సీఎం జగన్‌పై బురద జల్లుతున్నారు. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా విపరీతమైన బురద జల్లుతోంది. ఈనాడులో రామోజీరావు చాలా నీచమైన విష ప్రచారం చేస్తున్నారు. రామోజీరావు ఈ వయసులో కూడా శునకానందాన్ని పొందుతున్నాడు. చంద్రబాబులాగా షో చేయడం సీఎం జగన్‌కి తెలియదు’’ అని మంత్రి అంబటి పేర్కొన్నారు.
చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా.. తుపాను వచ్చిన సమయంలో మీరిచ్చిన దానికంటే సీఎం జగన్ ఎక్కువగానే పరిహారం అందించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతులకు వచ్చిన కష్టాన్ని తీర్చాలని పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్. ఈ రాష్ట్రంలో కొత్తవి కట్టింది.. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసింది వైఎస్సార్. ఆయన ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలని భావిస్తున్న వ్యక్తి సీఎం జగన్. అవుకు టన్నెల్‌ను పూర్తి చేసింది సీఎం జగన్. వెలిగొండ టన్నెల్ పూర్తిచేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తాం’’ అని మంత్రి అంబటి చెప్పారు.
‘‘తెలుగుదేశం అలసత్వం వల్లే గుండ్లకమ్మకు ఈ దుస్థితి. అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ఆలోచించాలి. టీడీపీ సమయంలోనే గుండ్లకమ్మ రిపేర్లు చేయాలని డ్యామ్ సేఫ్టీ సూచించింది. రూ. 5 కోట్లు ఖర్చు చేసి తూతూ మంత్రం చర్యలు చేపట్టి వదిలేశారు. రూ.5 కోట్లతో ఆరోజే సక్రమంగా రిపేర్లుచేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. యుద్ధప్రాతిపదికన స్టాపేజ్ పెట్టి నీటిని నిల్వ చేస్తున్నాం. గుండ్లకమ్మ విషయంలో టీడీపీ చేసిన పాపాన్ని మేం మోయాల్సి వస్తోంది’’ అని మంత్రి పేర్కొన్నారు.