తెలంగాణ వీణ , హైదరాబాద్ : ”భారత్ రాష్ట్ర సమితి కి వరుసగా రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి నేను బాధపడటం లేదు. కానీ.. అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందాను. తాజా ఫలితాలను ఓ పాఠంగా తీసుకొని మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే ఈ ట్విట్‌పై ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. నిజానికి ఇది చాలా మంచి ట్రెండ్‌ను సెట్ చేస్తుంది సర్ ఫ్యూచర్ కి. ఎందుకంటే ఓటమిని ఇంత సానుకులంగా తీసుకునే ఏ రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. మీకు అభినందనలు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మీలాంటి వారు అవసరం అని వర్మ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.