Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 అమెరికాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు

Must read

తెలంగాణ వీణ , అంతర్జాతీయం : అమెరికాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలను హిందూ అమెరికా ఫౌండేషన్ ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది. నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, సివిల్ రైట్స్ డివిజన్‌‌కు ఫిర్యాదు అందినట్టు కూడా వెల్లడించింది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.  కాగా, గతంలోనూ అమెరికాతో పాటూ పొరుగున ఉన్న కెనడాలో హిందూ వ్యతిరేక ఘటనలు వెలుగు చూశాయి. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you