తెలంగాణ వీణ, ములుగు : ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పస్రా గ్రామానికి చెందిన బైరి శ్రీకాంత్ ప్రమాదవశాత్తు మరణించగా, చల్వాయి గ్రామానికి చెందిన గుర్రం విజయ అనారోగ్యంతో మరణించగా ములుగు మండల జంగాలపల్లి గ్రామానికి చెందిన చింతరెడ్డి మధుకర్ రెడ్డి గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పరామర్శించి వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.