తెలంగాణ వీణ , సినిమా : కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సమయంలో నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ వివాహానికి నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం, సుహాసిని, దుల్కర్ సల్మాన్, లెజెండ్ శరవణన్, సుందర్.సి, ఖుష్బూ హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వివాహంతో శివాజీ గణేశన్ (ప్రభు తండ్రి) కుటుంబానికి చెందిన దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌కు నగలు, చెన్నైలో విలాసవంతమైన బంగ్లాతో పాటు నగదు రూపంలో కోటి రూపాయలు కట్నం ఇచ్చినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐశ్వర్య వయసు 34 ఏళ్లు కాగా, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ వయసు ఇప్పుడు 32 ఏళ్లు.