తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జనసేనాని పవన్ కల్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేశారు. ఈరోజు కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయం చేసుకుని పని చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతో కూడా ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత వారాహి యాత్రను కూడా ఆయన కాకినాడ నుంచే ప్రారంభించడం గమనార్హం.