Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ కోరిందని నిర్ధారించిన పాకిస్థాన్

Must read

తెలంగాణ వీణ , జాతీయం : 2008 నాటి భయానక ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్‌ అభ్యర్థించిందని పాకిస్థాన్‌ నిర్ధారించింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మనీలాండరింగ్ కేసులో హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత అధికారుల నుంచి విజ్ఞప్తి వచ్చిందని తెలిపారు. అయితే నేరస్థుల అప్పగింతకు సంబంధించి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు లేవని ఆమె ప్రస్తావించారు.ఇక హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాకిస్థాన్ కోరడం నిజమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం నిర్ధారించిన విషయం తెలిసిందే. ఒక కేసులో విచారణ కోసం హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని అభ్యర్థించినట్టు చెప్పారు. కాగా హఫీజ్ సయీద్ భారత్‌లో అనేక కేసులలో వాంటెడ్‌గా ఉన్నాడు. ..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you