తెలంగాణ వీణ , కొత్తగూడెం : కొత్తగూడెంలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో “సత్యం”స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నెకంటి సంజీవరాజు ఆధ్వర్యంలో సోమవారం పేదలకు బిర్యానీ ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ క్రిస్టమస్ పండుగ పురస్కరించుకొని సత్యం స్వచ్ఛంద సంస్థ ద్వారా బీదలకు, భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఒక పూట భోజనం పెట్టాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పొన్నెకంటి సమత, ఉపాధ్యక్షులు పొన్నెకంటి వర్షిత, కోశాధికారి పొన్నెకంటి జయకుమారి, బొడ్డు వేణు తదితరులు పాల్గొన్నారు.