తెలంగాణ వీణ , సినిమా : సలార్2 రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాని స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది. NTR31 వర్కింగ్ టైటిల్ తో ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా మైథలాజికల్ టచ్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ కథాంశంతోనే ఉంటుందని ఒక ప్రచారం నడుస్తోంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత వీలైనంత వేగంగా సలార్2ని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సలార్ నుంచి కంప్లీట్ గా బయటకొచ్చిన వెంటనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.