తెలంగాణ వీణ , వరంగల్ : మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పంచముఖ నాగేంద్ర స్వామీ దేవాలయం లో మొక్కులు చెల్లించుకున్న పంచాయితీ రాజ్ &స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
మంత్రి కి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు
ఈ సందర్భంగా మంత్రి వర్యులు సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నానని, ప్రతి గ్రామం మండలంలోని సమస్యలు తెలుసు అని అన్ని సమస్యలను తొలగించి ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామని సంక్షేమ పథకాలు రాష్ట్రములో ప్రతి ఒక్కటి అర్హులైన వారికి అందేలా చూస్తామని ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా మా పాలన ఉంటుంది అని సీతక్క అన్నారు.