తెలంగాణ వీణ , హైదరాబాద్ : సందర్భంగా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన మోదీ.. అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ‘‘శ్రీరాముడి నగరమైన అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలికవసతుల ఏర్పాటు, కనెక్టివిటీ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాను. అంతేకాకుండా, ఇతర కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తాను. దీంతో, అయోధ్య నగర ప్రజల జీవనం మరింత మెరుగవుతుంది’’ అని ప్రధాని మోదీ హిందీలో పోస్ట్ చేశారు. ఉదయం 11.15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్యలో ఆధునికీకరించిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తరువాత అమృత్ భారత్, వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.