తెలంగాణ విణా , వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన జనం మెచ్చిన పేద ప్రజల ప్రజా ప్రభుత్వమని సుపరిపాలన అందిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు
కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు పురోగతి కోసం పని చేస్తుందని అన్నారు సత్యం, అహింస పోరాట మార్గాన్ని ఎంచుకుని ప్రజల ప్రయోజనాల కోసం నేను భాగమైనందుకు గర్వపడుతున్నానని అన్నారు
స్వతంత్ర ఉద్యమం ద్వారా భారతదేశం సాధించాలని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గాంధీ నుండి మొదలుకొని నేటి రాహుల్ గాంధీ వరకు దేశ సమగ్రతకు దేశ అభివృద్ధి ధ్యేయంగా సర్వ మతాల ఐక్యత కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు
దేశ వ్యతిరేక వాదుల నుండి దేశ సమగ్రతను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న శక్తుల చేతిలో రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీలు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకోసం ప్రజలపక్షాన నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని మూడు రంగుల జెండా పట్టిన ఎందరికో గుర్తింపు గౌరవం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మచ్చ సుమన్ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి బూర దేవేందర్ గౌడ్ మాజీ జడ్పిటిసి పాడి కల్పన ప్రతాప్ మాజీ ఎంపిపి పసుల రాంమూర్తి బొచ్చు రూపచందర్ మంద రాంచందర్ గుడెల్లి సదన్ కుమార్ కొలుగూరి రాజేశ్వరరావు ఏకు రవికుమార్ పబ్బా శ్రీనివాస్ బొచ్చు మోహన్ బొచ్చు కుమార్ మహరాజ్ జెరుపోతుల గోపి గొట్టె రమేష్, ఎండి అలీ, గడ్డం చిరంజీవి రమేష్ చరణ్ రాజ్ రాజేష్,కె కుమార్ పి శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు