తెలంగాణవీణ, కాప్రా ; కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ సాయి నగర్ లో చేపట్టే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి శ్రీకారం చుట్టారు. శుక్రవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో 120 మీటర్ల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ధేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. పెండింగ్ లో ఉన్న అరకొర పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఆధికారులు,సిబ్బంది ఏ ఈ స్వరూప గారు వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,డివిజన్ నాయకులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.