తెలంగాణ వీణ , సినిమా : సోషల్ మీడియాలో పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకుని ఇష్టానుసారంగా సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారు తయారు అయ్యారు. ఫోన్స్ లో కూడా మార్ఫింగ్ వీడియోలు మరియు ఫోటోలు తయారు చేసే యాప్స్ రావడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సెలబ్రెటీలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తూ శునకానందం కు పాల్పడుతున్నారు. టీవీ సీరియల్స్ మరియు జబర్దస్త్ ఇతర ఈటీవీ కార్యక్రమాల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న రీతూ చౌదరి వీడియో ఒకటి కొన్నాళ్ల క్రితం వైరల్ అయింది. ఆ వీడియో విషయం లో రీతూ మొదట లైట్ తీసుకున్నా కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో ను ఇంకా కూడా కొంత మంది షేర్ చేస్తూ ఉండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన రీతూ చౌదరి తన మార్ఫింగ్ వీడియో పై ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేసినట్లుగా ఆమె పేర్కొంది. ఒక వీడియోను విడుదల చేసి ఆమె తన పరిస్థితిని మరియు తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు గురించి కూడా అందులో తెలియజేసింది.