తెలంగాణ వీణ ,హైదరాబాద్ : మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో బస్సులోని వెనక సీట్ల వరకూ మహిళలే కనిపిస్తున్నారు. దీంతో, సీటు దొరకని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్ మీటింగ్‌లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ.. కొన్ని రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తోంది. విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పురుషులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు యోచనలో ఆర్టీసీ సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.