తెలంగాణ వీణ, కాప్రా: ఉప్పల్ నియోజకవర్గం నూతన శాసనసభ్యునిగా ఎన్నికైన బండారి లక్ష్మారెడ్డి ని మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ తుమ్మల దుర్గాప్రసాద్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నల్లూరి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కొండబాల పద్మారావులు కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న లక్ష్మారెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు చేపడతారని తెలిపారు. కుల మతాలు, ప్రాంతాలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.