తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీ రామారావు అభినందనలు తెలిపారు. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేటీఆర్ ఓటమిని అంగీకరించారు. తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజు వచ్చిన ఫలితాలపై తాము బాధపడలేదని, కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. అయితే ఈ ఓటమిని నుంచి తాము నేర్చుకుంటామని, తిరిగి బలంగా పుంజుకుంటామని వ్యాఖ్యానించారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి వయస్సు అయిపోదు… గురి తప్పింది అంతే అన్నారు.