తెలంగాణ వీణ , హైదరాబాద్ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్య మంగళవారం ఎక్స్ లో మాటల యుద్ధం జరిగింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో గ్యారెంటీలని చెప్పాం. అంత మాత్రానా అన్నీ ఫ్రీగా ఇస్తామా. అయినా మాకూ ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు. అని కర్ణాటక అసెంబ్లీలో సిద్ధారమయ్య మాట్లాడినట్లుగా ఒక హ్యాండిల్‌లో పోస్ట్ అయిన వీడియోపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి రానుందని కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ కామెంట్ చేశారు. అయినా ఎన్నికల హామీలిచ్చేటపుడు ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహన ఉండాలిగా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు సిద్ధరామయ్య అంతే ఘాటుగా స్పందించారు. కేటీఆర్ మీరు తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలుసా.కనీసం మీకు నిజమేంటో..నకిలీ, ఎడిటెడ్ ట్వీట్ ఏంటో తెలియదు అందుకే ఓడిపోయారు.