తెలంగాణ వీణ , హైదరాబాద్ : సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. రేపు డిశ్చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు.