తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రాత్రి తన ఫాంహౌస్ లోని బాత్రూమ్ లో జారిపడడం తెలిసిందే వైద్య పరీక్షల్లో ఆయన తుంటి భాగానికి తీవ్ర గాయం అయినట్టు వెల్లడైంది. కేసీఆర్ కు చికిత్స చేస్తున్న సోమాజిగూడ యశోదా ఆసుపత్రి వైద్యులు ఈ మేరకు బులెటిన్ కూడా విడుదల చేశారు.
దీనిపై కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ గారు బాత్రూంలో జారిపడ్డారని, ఆయనకు వైద్యులు ఇవాళ తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తన ట్వీట్ లో పేర్కొన్నారు.