Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా.. సినీ నిర్మాత నట్టి కుమార్

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తాను త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. చోడవరంలోని పూర్ణా థియేటర్‌లో నిన్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత తాను వైసీపీ సానుభూతిపరుడినేనని, అయితే, జగన్ తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయానని తెలిపారు. జగన్ మొత్తం రెడ్డి కులపాలన చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్ రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు కూడా గుర్తించారన్నారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టు చెప్పిన ఆయన తమలాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి ఉపయోగించుకుందని విమర్శించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ రూ. 2 కోట్ల విలువైన చర్చి ఆస్తులను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you