తెలంగాణవీణ , జవహర్ నగర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని ప్రభుత్వ స్ధలాల్లో దర్జాగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతునే ఉన్నాయి. వేలాధి ఏకరాల ప్రభుత్వ స్ధలాన్ని పరిరక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమైతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో దర్జాగా రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రధాన రహాదారులపై విచ్ఛల విడిగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శులున్నాయి. గ్రామపంచాయితీగా ఏర్పడినప్పటి నుంచి కార్పొరేషన్ గా మారినా ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో మాత్రం విఫలమైయ్యారనే ఆరొపనులున్నాయి.
జవహర్ నగర్ ఏలా ఏర్పడిందంటే…
దేశ సైన్యంలో పనిచేసిన కొంతమందికి అప్పటి ప్రభుత్వం జవహర్ నగర్ లో కేటాయించింది. వారందరూ మాజీ సైనికుల పేరుతో సంక్షేమ సంఘాన్ని ఏర్పరచుకొని భూములను కాపాడుతూ వచ్చారు. వీరిలో 146 మంది మాత్రమే అందుబాటులో ఉండటంతో వారికి ప్రభుత్వం ఎన్ఎసీలు జారీ చేసింది. వారిలోనూ 102 మందిని అర్హులుగా గుర్తించారు.
మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే అధికారుల అండదండలతో కొందరు వ్యక్తులు మాజీ సైనికోద్యోగుల పేరుతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించు కొని నిర్మాణాలు చేపట్టడం మొదలు పెట్టారు. ఇందులో అధికారులు, నేతలు కీలక పాత్రలు పోషిస్తూ చక్రం తిప్పుతున్నారనే ఆరొపణలున్నాయి. కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలు స్వాహా చేస్తూ భూ దందా కొనసాగిస్తున్నారు. అయితే అధికారులు కూల్చివేతలు చేపట్టడం, కొన్ని రోజులకే తిరిగి యథేచ్చగా నిర్మాణాలు చేపట్టడం ఇక్కడ సర్వసాధారనంగా మారింది. గ్రామపంచాయితీ హాయంలోని గ్రామకంఠం స్థలాలు, అప్పడు ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూముల సూచిక చిహ్నాలు నేడు మచ్చుకైనా కనిపించకపోవటం గమనార్హం. ఇప్పటికీ ప్రభుత్వ భూములుగా సూచించే బోర్డులు హాంఫట్ అవుతున్నా సంఘటనలు వెలుగుచూస్తున్నా అధికారుల్లో ఏలాంటి చలనం రావటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. జవహర్ నగర్ లో కోట్లు విలువ చేసే ప్రభుత్వం భూములు
అన్యాక్రాంతవుతునే ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్థలాల బోర్డులెన్నీ, నేడు ఎన్ని ఉన్నాయో విచారణ చేపడితే ఇక్కడి భూబాగోతం మొత్తం వెలుగుచూస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అన్యాక్రాంతమైతున్న ప్రభుత్వ భూముల్ని కాపాడి ప్రజా అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ణప్తి చేస్తున్నారు. మరి అధికారులు ఏలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.