తెలంగాణ వీణ,భద్రాద్రి కొత్తగూడెం :చుంచుపల్లి మండలంలోని ప్రశాంతినగర్ గ్రామపంచాయతీ పరిధిలోని గరిమెళ్ళపాడు గ్రామాన్ని స్థానిక గిరిజనుల కోరిక మేరకు బుధవారం భద్రాచలం ఐటిడిఏ అధికారి ప్రీతిక్ జైన్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రహదారి ప్రతిపాదన రైల్వే ట్రాక్ పై వంతెన నిర్మాణం మామిడి జామ తోటల అభివృద్ధి స్థానికులకు ఈ తోటల యందు ఉపాధి కల్పించుట ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్స్ ఎకరం భూమిలో మునగ పెంపకం మొదలగు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి తహసిల్దార్ కృష్ణ, మందా మంగమ్మ ఎంపీడీవో, గుంటి సత్యనారాయణ ఎంపీవో, సర్పంచ్ పద్మ, డేవిడ్ రాజు, ఐటీడీఏ ఏపీవో సురేష్, పంచాయతీ కార్యదర్శులు రఘు, భాష, ఉపేందర్, ఈజీఎస్ ఏపీవో రఘుపతి, ఈసీ పిల్లి నాగరాజు, టిఏ అనిల్ తదితరులు పాల్గొన్నారు.