తెలంగాణ వీణ , సినిమా : అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల తాజాగా ‘మహా మ్యాక్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. పెళ్లైన కొత్తలో నాన్నకి చాలా కోపం ఉండేదని అమ్మ చెబుతూ ఉండేది. మాకు ఊహ తెలిసిన తరువాత ఆయన కోపంగా ఉండటం మేము చూడలేదు. ఎప్పుడూ సరదాగానే మాట్లాడుతూ ఉండేవారు” అని అన్నారు. వేసవి సెలవుల్లో నాన్నగారి సినిమాల షూటింగులకు వెళ్లేవాళ్లం. అప్పట్లో ఊటీలో ఎక్కువగా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఇక నాన్నగారి సినిమాలు చాలా వరకూ నేను పూర్తిగా చూడలేదు. ఎందుకంటే తెరపై ఆయనని ఎవరైనా కొడుతూ ఉంటే నేను చూడలేకపోయేదానిని. ఇక బయట కూడా నాన్నను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు సహించేదానిని కాదు” అని అన్నారు.