తెలంగాణ వీణ , జాతీయం : పాకిస్థాన్ లో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్, ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన చనిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై దావూద్ సన్నిహితుడు ఛోటా షకీల్ స్పందిస్తూ… ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పాడు. వెయ్యి శాతం ఆరోగ్యంగా, ఫిట్ గా దావూద్ ఉన్నారని తెలిపాడు. దావూద్ పై క్రమం తప్పకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించాడు. ఇటీవలే పాకిస్థాన్ లో దావూద్ ను తాను కలిశానని చెప్పాడు. ఓ జాతీయ మీడియి సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు.