తెలంగాణ వీణ , మందమర్రి : సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టియుసి ఎల్లప్పుడూ ఉంటుందని యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య లు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు గాను 06 ఏరియాలో ఐఎన్టీయూసీ గెలిపించిన కార్మికులకు, అదే విధంగా సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టియుసి కి ఓట్లు వేసి, ఆదరించిన కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ రెండో స్థానంలో నిలిచినప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు 39 డిమాండ్లు, ఆరు గ్యారెంటీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన హామీ మేరకు నూతన బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తామని, ప్రైవేటికరణ నిలువరిస్తామని తెలిపారు. అదేవిధంగా కార్మికులకు సొంతింటి కల అమలుకై కార్మికులకు 250 గజాల స్థలం ఇప్పించి, ఇంటి నిర్మాణానికి 20లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తామని, మహిళా కార్మికులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. సింగరేణిలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు సైతం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సింగరేణి మనుగడకు, అభివృద్ధి, కార్మిక వర్గ ప్రయోజనాలకు, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఏరియాలో స్వల్ప తేడాతో రెండో స్థానంలో ఐఎన్టీయూసీ నిలిచిందని, అయినప్పటికీ ఐఎన్టియుసి గెలిచినా, ఓడిన కార్మికులకు ఎల్లప్పుడూ భరోసాగా ఉంటూ, కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మిట్ట సూర్యనారాయణ, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్, నాయకులు పుల్లూరి లక్ష్మణ్, దొరిశెట్టి చంద్రశేఖర్, బత్తుల వేణు, వెంకటస్వామి రాజేంద్రప్రసాద్, స్వామి, సివి రమణ, ఇప్ప సమ్మయ్య, శ్రీనివాస్, చారి, సంపత్, శ్రీకాంత్, కమల్, భీమారపు సదయ్య, ఈ యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన ఐఎన్టియుసి
