తెలంగాణ వీణ, సినిమా : 2023… ఇయర్ ఆఫ్ కంబ్యాక్స్ అనే చెప్పాలి. ముందుగా జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన షారుఖ్, తన రేంజ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. సన్నీ డియోల్ కూడా గదర్ 2 సినిమాతో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సోలో హిందీ కలెక్షన్స్ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. ఆ హిట్ లోటుని, ఆ ఆకలిని తీర్చేసింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ దాదాపు 700 కోట్లని కలెక్ట్ చేసింది. ఇలా ఈ ఇయర్ మొత్తం స్టార్స్ కంబ్యాక్ ఇచ్చారు, ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్… అలాంటి హీరో కంబాయ్క ఇస్తే ఎలా ఉంటుందో ఈరోజు సలార్ టాక్ చూస్తే తెలుస్తుంది. 99% బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఏకైక సినిమాగా సలార్ నిలిచింది. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి సలార్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం గ్యారెంటీ. బాహుబలి తర్వాత గత ఆరున్నర ఏళ్లుగా ప్రభాస్ హిట్ కొడతాడు అని ఎంతో ఆశగా వెయిట్ చేసారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఓపెనింగ్స్ ని రాబట్టాయి కానీ హిట్ పడలేదు. ఇప్పుడు ఆ హిట్ లోటుని తీర్చేస్తుంది సలార్ సీజ్ ఫైర్. ఓపెనింగ్స్ కాదు హిట్ టాక్ పడింది కాబట్టి లాంగ్ రన్ లో చూడండి మా సత్తా ఏంటో అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. యావరేజ్ టాక్ అయినా వస్తే బాగుండు అనుకుంటున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ యునానిమస్ హిట్ టాక్ వచ్చేసింది. ఇక బాక్సాఫీస్ పైన దండయాత్ర ఏ రేంజులో ఉండబోతుందో చూడాలి.