తెలంగాణ వీణ , కరీంనగర్ : నవ మాసాలు మోసి కనాలి. పాలిచ్చి పెంచాలి. అడిగివన్నీ చేసి పెట్టాలి. అపురూపంగా చూసుకోవాలి. కానీ, వయసు మీద పడితే.. ఆ తల్లి భారమైపోతుందా?.. అలాగే అనుకున్నాడు ఇక్కడ ఓ కొడుకు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోలేనంటూ చలిలో రోడ్డు పక్కన పడేశారు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్తతోపాటు పెద్ద కొడుకు రాజయ్య, ఓ కూతురు కొన్నాళ్ల కిందట చనిపోయారు. వయసు పైబడడంతోపాటు ఇళ్లు పాడుబడి పోయింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకుల కుటుంబాలు వంతులవారీగా లచ్చమ్మను చూసుకుంటూ వస్తున్నారు. రాజయ్య కుటుంబం మహారాష్ట్రంలో ఉంటోంది. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్ తీసుకొచ్చి దిగబెట్టింది.