తెలంగాణ వీణ , హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను 42 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే మద్దతు తెలిపారని సమాచారం. అంటే మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈ విషయాన్ని కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకొని టీపీసీసీ చీఫ్‌కే ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సీఎం రేసులో రేవంత్‌తో పాటు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.