తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి, 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. మరోవైపు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.