తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్న ఒక వీడియోను షేర్ చేసిన కవిత… ‘మై హీరో’ అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసిన బీఆర్ఎస్ అభిమానులు సంబరపడుతున్నారు. మరోవైపు వీడియోలో కేసీఆర్ నడుస్తుంటే… ఆయనంటే ఒక హీరో ఫీలింగ్, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం అంటూ బ్యాక్ గ్రౌండ్ లో మాటలు వినిపిస్తాయి.