తెలంగాణ వీణ , హైదరాబాద్ : దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 19వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీవీ జ్ఞాన భూమి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిష్ణాతుడైన పండితుడు, రాజనీతిజ్ఞుడు, పరిపాలదక్షకుడు.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన గొప్ప బిడ్డ అని పీవీని కొనియాడారామె.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం, మంత్రులు పలువురు నేతలు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీని అభివర్ణిస్తూ.. దేశానికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఉంచింది.